హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఉదయం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మూడు నెలల్లో 1900 వైద్యుల పోస్టులు, మూడేళ్లలో 12వేల నర్సులు, 9117 పారామెడికల్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. 108 సిబ్బంది సమ్మె విరమింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు అదేశాలు జారీ చేశారు.




