హైదరాబాద్: మధ్యాహ్నం ఒంటి గంటలోపు క్యూలో ఉన్నవారిని ఓటింగ్‌కు అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ తెలిపారు. పోలింగ్ కేంద్రానికి ఒంటిగంటలోపు చేరుకున్న వారందరికీ చీటీలు ఇస్తామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో 7,విశాఖ జిల్లాలో 4 పంచాయతీలకు ఎన్నికలు వాయిదా పడినట్లు నవీన్‌మిట్టల్ తెలిపారు.




