హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ పీఆర్‌టీయూ పోరాట బాట పడుతోంది. వచ్చే నెల 7న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల ముందు తొలి దశలో ధర్నా చేపట్టనుంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే రెండో దశలో ఆగస్టు 22న అన్ని జిల్లా కేంద్రాల్లో డీఈవో కార్యాలయాల ముందు ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పీఆర్‌టీయూ ఈరోజు ఉదయం సచివాలయం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిమహంతిని కలిసి ధర్నా నోటీసు అందించింది. పదో పీఆర్‌సీ వేతన స్కేళ్లను వెంటనే ప్రకటించాలని, జులై 1 నుంచి 60 శాతం తాత్కాలిక భృతి మంజూరు చేయాలని డిమాండ్ చేసింది. మొత్తం 25 రకాల డిమాండ్లతో పీఆర్‌టీయూ నోటీసు అందజేసింది.




