హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఇంకా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు. 11వ నెంబరు పోలింగ్ కేంద్రంలో మహిళ ఓటు వివాదం కారణంగా లెక్కింపు ప్రారంభం కానట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నాదేరులో భోజన సదుపాయం కల్పించలేదని అధికారులు ఓట్ల లెక్కింపు బహిష్కరించినట్లు సమాచారం.




