భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. వరద ఉద్ధృతికి పెరుగుతుండటంతో కరకట్టకు ఉన్న స్లూయిజ్‌లను మూసివేశారు. దీంతో భద్రాచలం పట్టణంలో వర్షపునీరు నిలిచిపోయింది. రామాలయం ప్రాంతంలో మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గోదావరినీటి మట్టం మరో రెండు, మూడు అడుగులు పెరిగే అవకాశం ఉన్నట్లు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.