పోలింగ్ కేంద్రం వద్ద బ్యాలెట్ పత్రాలు లభ్యం
వరంగల్: వరంగల్ జిల్లా పరకాల మండలంలోని పులిగిల్ల పోలింగ్ కేంద్రం వద్ద బ్యాలెట్ పత్రాల కట్ట లభ్యమైంది. దీంతో గ్రామస్థులు రీపోలింగ్ లేదా రీకౌంటింగ్ జరపాలని ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో గ్రామంలో 144 సెక్షన్ విధించారు.