Tuesday, 3 November 2026

మంచి నాయకుణ్ణి ఎన్నుకోమని ముందే చెప్పా చంద్రబాబు

హైదరాబాద్‌: తొమ్మిదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని, సర్పంచులుగా మంచి నాయకుణ్ణి ఎన్నుకోమని ముందు నుంచే చెప్పానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు బాగా పనిచేశారని ప్రశంసించారు. ఎన్నికల రెండు, మూడు దశల్లోనూ తెదేపా బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని చంద్రబాబు కోరారు. స్థానిక సంస్థలకు పూర్తి అధికారాలు కల్పించి న్యాయం చేస్తామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో అవినీతి పెరిగి పోయిందన డానికి కారణం కాంగ్రెస్‌ పార్టీయేనని, పంచాయతీ రాజ్‌ వ్యవస్థను కాంగ్రెస్‌ పార్టీ నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. తెదేపా హయాంలో అన్ని ఎన్నికలు సకాలంలో జరిపించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *