భద్రాచలం: గోదావరి వరద ఉద్ధృతి నిలకడగా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద ఈ రోజు ఉదయం 10గంటలకు 56.9 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం నిలకడగా ఉంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నందిగామ, నందిగామపాడు వద్ద రహదారిపై వరద నీరు ఏడు అడుగుల మేర ప్రవహిస్తుండటందో భద్రాచలం-కూనవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వీఆర్‌పురం మండలం శబరి, గోదావరి పరివాహక ప్రాంతాల్లోనిపది గ్రామాల్లోకి వరద నీరు చేరింది. మరో పది గ్రామాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారం రోజులుగా వడ్డిగూడెం జలదిగ్బంధంలోనే ఉండటంతో విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.




