హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , ధర్మాన ప్రసాదరావుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. వారిని జుడిషియల్ కస్టడీకి తరలించాలని సీబీఐ అధికారులు పెట్టుకున్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. తీర్పును ఆగష్టు 7 కు వాయిదా వేసింది.




