అహ్మదాబాద్‌లో భవనం కూలడంతో ఇద్దరికి గాయాలు
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మూడంతస్థుల భవనం శుక్రవారం కుప్పకూలింది. నగరంలోని రానిప్ ప్రాంతంలో రూపాల్ అపార్టుమెంటు శుక్రవారం ఉదయం సుమారు 11గంటల ప్రాంతంలో కుప్పకూలినట్టు అగ్రిమాపక సిబ్బంది ఒరు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అగ్రిమాపక సిబ్బంది తెలిపారు. మరికొందరు దీని కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.