హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అపశృతి చోటుచేసుకుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన కొందరు గుండెపోటుతో మృతి చెందారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని లింగన్న పేటలో గోపయ్య అనే వృద్ధుడు ఓటు వెయ్యడానికి వచ్చి పోలింగ్ కేంద్రం వద్ద మృతి చెందాడు. నేలకొండపల్లి మండలం బోదులకొండలో ఓటేసి బయటకు వస్తున్న ఓ మహిళ మృతి చెందింది. నల్గొండలో జిల్లాలోని ఓటు వేసి బయటకు వస్తుండగా ఓ వృద్ధురాలు మృతి చెందింది. కడప జిల్లా సిద్ధవటం మండలం మూలపల్లెలో ఓటు వేయడానికి వెళ్లి గుండెపోటుతో వృద్ధుడు మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలోని రెడ్డి గణపవరంలో ఓటు వేసేందుకు వచ్చి లక్ష్మయ్య (80) మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ గ్రామీణం మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో రామవ్వ (60) ఓటు హక్కు వినియోగించుకుని ఇంటికి వెళ్లి ప్రమాదవశాత్తూ కిందపడి మృతి చెందింది.




