Wednesday, 4 November 2026

ముగిసిన రెండో విడత పంచాయతీ పోలింగ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. పలు ప్రాంతాల్లో ఓటు వేసేందుకు జనం వరుసలో వేచివున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేంద్రం వద్ద వరుసలో ఉన్న వారందరికీ  ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే కొన్ని చోట్ల గుర్తులు తారుమారు కావడం. అభ్యర్థుల పేర్లు లేకపోవడం కొంత గందరగోళం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *