హైదరాబాద్: ఈ రోజు ఉదయం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. రెండో విడతలో 916 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ముందుగా వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి అనంతరం సర్పంచ్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంకాలానికల్లా చాలా వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.




