Wednesday, 4 November 2026

పార్టీ స్పష్టత ఇవ్వలేదని బయటకు వచ్చాం: కొండా సురేఖ

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంత నేతలతో వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మాట్లాడుతూ కొండా సురేఖ తాము విజయమ్మతో సమావేశం నుంచి అసంతృప్తితో బయటకు వచ్చామని తెలిపారు. తెలంగాణ అంశంపై పార్టీ స్పష్టత ఇవ్వలేదని, రాజీనామాలు వ్యక్తిగతమా, పార్టీ నిర్ణయమా అన్నదానిపై విజయమ్మ స్పష్టత ఇవ్వలేదని కొండా సురేఖ తెలిపారు. తమ తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. తెలంగాణ వస్తుందనుకుంటున్న తరుణంలో తాము అడ్డుపుల్లలు కాదలచుకోలేదని ఆమె తెలిపారు. ఈ సంఘటనతో కొండా సురేఖ సహా ఆ పార్టీ తెలంగాణ నేతలకు వైకాపాతో దూరం పెరిగినట్లు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *