Tuesday, 3 November 2026

రాష్ట్ర విభజనకు సహకరించండి: కోదండరాం

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. రాష్ట్ర విభజనకు సహరించాలని ఆయన కోరారు. ఇవాళ టీఎన్టీవో భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరే సమయంలో తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇచ్చే వరకు తాము ఉద్యమాన్ని ఆపబోమని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *