హైదరాబాద్:రెండో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 1680 స్థానాలను ఫలితాలు తెలిశాయి. వీటిలో 507స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు, 432 స్థానాలను తెదేపా మద్దతుదారులు, 257 స్థానాలను వైకాపా మద్దతుదారులు, 88 స్థానాలను తెరాస మద్దతుదారులు, 13 స్థానాలను వామపక్షాల మద్దతుదారులు గెలుచుకోగా 383 స్థానాల్లో ఇరుతరులు విజయం సాధించినట్లు సమాచారం.




