హైదరాబాద్ : సరూర్‌నగర్ మండలం మీర్‌పేట లెనిస్‌నగర్‌లో రౌడీషీటర్ శంకర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శంకర్‌ను స్థానికంగా నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి దుండగులు కత్తులతో పొడిచి చంపారు. ఈ హత్యకు కుటుంబ కలహాలతో పాటు స్థానిక వివాదాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శంకర్ రెండో భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




