Tuesday, 3 November 2026

త్రిమూర్తులకు హైకమాండ్‌ నుంచి పిలుపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణపై రోడ్‌మ్యాప్‌ నవేదించి, కాంగ్రెస్‌ వార్‌రూమ్‌ భేటీలో పాల్గొన్న త్రిమూర్తులకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను మంగళవారం ఉదయం హస్తిన రావాలి హైకమాండ్‌ ఆదేశించింది. రేపు యూపీఏ సమన్వయ కమిటీ, సీడబ్ల్యూ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో వారికి హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో వారు రేపు ఉదయం హస్తిన బాట పట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *