హైదరాబాద్: చంచల్గూడ జైల్లో ఉన్న జగన్ను వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో సహా పార్టీ ముఖ్య నేతలు కలిశారు. జగన్ను కలిసిన వారిలో మైసూరారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి , రామకృష్ణారెడ్డి ఉన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండటంతో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే వైకాపాకు చెందిన 16మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన అంశంతో పాటు ఈ రోజు కొండా సురేఖ జగన్కు బహిరంగలేఖ రాసిన విషయంపై వీరు జైల్లో చర్చించినట్లు సమాచారం. జైల్లో జగన్తో సుమారు రెండుగంటలపాటు చర్చలు జరిపిన విజయమ్మ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.




