హైదరాబాద్,(జనంసాక్షి): రాయల తెలంగాణ వద్దని తెలంగాణ సామాజిక జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ సమాజిక జేఏసీ గాంధీభవన్‌ను ముట్టడించింది. గాంధీభవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ తప్ప వేరే దేనికి ఒప్పుకోమని తేల్చిచెప్పింది. రాయల తెలంగాణ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేసింది. రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతుందని హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, లేకుంటే ఇరు ప్రాంతాల్లో ఉధ్రిక్తతలు పెరుగుతాయని వారు స్పష్టం చేశారు.




