హైదరాబాద్,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్ పిలుపు నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. సాయంత్రం సోనియా నివాసంలో జరిగే సీడబ్ల్యూసీ భేటీకి సీఎం హాజరవుతున్నట్లు సమాచారం. ఢిల్లీ బయల్దేరే ముందు క్యాంపు కార్యాలయంలో సీఎంతో మంత్రులు బాలరాజు, అహ్మదుల్లా సమావేశమయ్యారు. సీమాంధ్ర మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, కొండ్రు మురళీ, పితాని సత్యనారాయణ కూడా హస్తిన వెళ్లారు.




