Monday, 2 November 2026

తెలంగాణ ప్రజలకు సుష్మాస్వరాజ్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో తెలంగాణ ఐకాస నేతలు ప్రజలకు భారతీయ జనతా పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్‌ శుభాకాంక్షలు తెలిపినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాతుతూ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని సుష్మా స్వరాజ్‌ మరోసారి గుర్తు చేశారని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *