Monday, 2 November 2026

తెలంగాణభవన్‌ వద్ద సంబురాలు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణకు అనుకూలంగా అడుగులు వేస్తుండటంతో తెలంగాణ వాదుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇవాళ ఢిల్లీలో జరిగిన యూపీఏ సమన్వయ కమిటీ భేటీ, సీడబ్ల్యూసీ సమావేశాల్లో తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు వెలువడటంతో తెలంగాణభవన్‌ వద్ద టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణ వాదులు సంబురాలు చేసుకుంటున్నారు. ఆనందోత్సహాలతో నృత్యాలను చేస్తున్నారు. కాసేపట్లో ఏఐసీసీ అధికారికంగా చేయనున్న ప్రకటన కోసం ఉత్సుక్తతో, ఉత్సాహంతో ఎదురు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *