తెలంగాణ ఏర్పాటును ఇతర డిమాండ్లతో పోల్చలేం: దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో దేశంలో ఇతరప్రాంతాల్లో వివిధ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వస్తాయన్న వాదనను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ తోసిపుచ్చారు. తెలంగాణ ఏర్పాటును ఇతర రాష్ట్రాల ఏర్పాటు చేయాలన్న డిమాండుతో పోల్చలేమని ఆయన అన్నారు.