భోపాల్: ఉమ్మడి రిజధాని అంశంపై తప్పుుగా అర్థం చేసుకోవద్దని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. భోపాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగానే ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు త్వరగా ఆమోదం పొందేందుకు అందరూ ప్రయత్నించాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే నిర్ణయం తీసుకున్నట్లు వెట్లడించారు.




