హైదరాబాద్,(జనంసాక్షి): పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టేవరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ జేఏసీ నేతలు తెగేసి చెప్పారు. ఇవాళ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డితో వారు భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమ భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చించారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడితే తప్పా ఉద్యమాన్ని విరమించేది లేదని వారు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర నేతలు సహకరించాలని వారు కోరారు.




