హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర నేతలు, మంత్రులు, రాజీనామాలు చేయడంపై తెలంగాణ నేత పాశం యాదగిరి మండిపడ్డారు. వాళ్ల రాజీనామాలన్నీ వట్టి డ్రామా అని ఎద్దేవా చేశారు. వాళ్లు ఇవాళ చేసే రాజీనామాల కట్ట ఎటు పోదని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దే భద్రంగా ఉంటుందని తెలిపారు. ఇదంతా సీఎం కిరణ్‌కుమార్, మంత్రులు కలిసి ఆడుతున్న నాటకమని విమర్శించారు. ఇది వాళ్ల ప్రాంతంలో వాళ్లవాళ్ల నియోజక వర్గంలో మైలేజీ కోసం చేస్తున్న కుటిల యత్నాలని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రులు మరో కుట్రకు తెరతీశారని ఆయన అన్నారు.




