Tuesday, 3 November 2026

విగ్రహాల ధ్వంసంపై సీఎం సీరియస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్రలో రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాల ధ్వంసంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలపై సీఎస్‌ మహంతి, డీజీపీ దినేష్‌రెడ్డితో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తేవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. ప్రశాంతంగా ఉద్యమం చేసుకోవాలని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *