హైదరాబాద్: పాతబస్తీ మక్కా మసీదులో రంజాన్ చివరి శుక్రవారం ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయని కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఎల్లుండి పాతబస్తీలోని బోనాలకు అదనపు బలగాలతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రక్షణ కోసం 15 కంపెనీల కేంద్ర బలగాలు, 45 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలను రప్పించినట్లు కమిషనర్ చెప్పారు.




