ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ఉదయం 6 గంటలకు నీటిమట్టం 60 అడుగులకు చేరింది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేవ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 18.9 అడులకు చేరింది. 21 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది.




