హైదరాబాద్: పాతబస్తీలో ఆషాడమాసం బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారు జామునుంచే భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. బోనాల సందర్భంగా పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సింహవాహిని లాల్ దర్వాజ మహంకాళీ ఆలయానికి తెదేపా నేత శ్రీనివాస్‌యాదవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు ఆ పార్టీనేతలు బండారు దత్తాత్రేయ, బద్దం బాల్‌రెడ్డి తదితరులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.




