Wednesday, 4 November 2026

కేసీఆర్‌ మాటలను వక్రీకరిస్తున్నారు. వివేక్‌

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాటలను కొందరు వక్రీకరిస్తున్నారని ఎంపీ వివేక్‌ తెలిపారు. కేసీఆర్‌ జాగో బాగో అని ఏనాడూ చెప్పటేదు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఎక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో కొత్త రాజధానిని హైదరాబాద్‌ కంటే ఎక్కువ అభివృధ్ది చేసుకోవచ్చు అని సూచించారు. రాజధాని ఏర్పాటుతో సీమాంధ్ర లో 25 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సీఎం, పీసీసీ చీఫ్‌లు తెలంగాణ వ్యతిరేకులు అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *