Tuesday, 3 November 2026

యువతులపై కత్తులతో దాడి చేసిన మహిళ

నిజామాబాద్‌,(జనంసాక్షి): ఇద్దరు యువతులపై స్వరూప అనే మహిళ కత్తులతో దాడి చేసింది. ఈ ఘటన నిజాంసాగర్‌ మండలం గర్గోల్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు యువతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితురాలు స్వరూపను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *