హైదరాబాద్,(జనంసాక్షి): ఆంధ్రా ఆధిపత్యాన్ని కూల్చాల్సిందే అని అప్పటి వరకు తెలంగాణకు పూర్తి స్వతంత్రం రాదు అని టీఆర్ఎస్ఎల్సీ నేత ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. పార్లమెంట్లో సీమాంధ్ర ఎంపీలంతా కలిసి డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీమాంధ్ర పార్టీల నాటకాలను తెలంగాణ ప్రజలు గుర్తించాలని సూచించారు.




