హైదరాబాద్,(జనంసాక్షి): విద్యుత్‌సౌదలోని తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. లంచ్ విరామ సమయంలో వాళ్లు బయటకు వచ్చి తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. తెలంగాణ ఉద్యోగుల ఆక్షాంక్షను త్వరగా నెరవేర్చాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సీమాంధ్ర ఉద్యోగులు సహకరించాలని ఆయన కోరారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాన్ని విరమించాలని ఆయన కోరారు.




