హైదరాబాద్,(జనంసాక్షి): సీమాంధ్ర ఎంపీ లగడపాటి వద్ద అస్త్రాలన్నీ అయిపోయాయని ఇక ఆయన దగ్గర ఏ అస్త్రాలు లేవని తెలిపారు. ఆయన అస్త్ర సన్యాసం పుచ్చుకోవడమే మిగిలిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన జరిగాక 610 జీవోను కచ్చితంగా అమలుచేస్తామని మంత్రి జానారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే 610 జీవోను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. చట్ట ప్రకారమే జీవో అమలు ఉంటుందని, సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చెందవద్దని కోరారు.




