Tuesday, 3 November 2026

ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ఓ మహిళ మృతి

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఓ మహిళ సరైన వైద్యం అందక మృతి చెందింది. కూనవరం మండలంలోని టేకులబోరు గ్రామానికి వేదవతి (45) విరేచనాలతో బాధపడుతూ సోమవారం రాత్రి కూనవరం ప్రభుత్వం ఆసుపత్రిలో చేరింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు వైద్యం చేశారు. ఈ క్రమంలో సరైన వైద్యం అందక వేదవతి మంగళవారం ఉదయం మృతి చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *