Tuesday, 3 November 2026

15రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న ఏడు లంకగ్రామాలు

అంబాజీపేట: తూర్పుగోదావరి జిల్లా అయినవెల్లి మండలంలోని ఏడు లంక గ్రామాల ప్రజలు గత 15రోజులుగా వరద నీటిలో చిక్కుకుని ఉన్నారు. మండలంలోని అయిన వెల్లి లంక, వీరపల్లిపాలెం, కె పెద్దలంక, కొండుకుదురు లంక, చింతల లంక, మడిపెల్ల లంక, పొట్టి లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 4,638 కుటుంబాలు గోదావరి నీటిలో కాలం వెళ్లదీస్తున్నాయి. వీరవల్లిపాలెం, కొండుకుదురు, ముక్తేశ్వరం గ్రామాల్లో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలు అక్కడికి రావడంలేదు. దీంతో అధికారులే ఆహార పొట్లాలను గ్రామాలకు తీసుకెళ్లి ప్రజలకు అందిస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలకు ఇప్పటి వరకు 40వేల మంచి నీటి ప్యాకెట్లను సరఫరా చేశామని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *