Tuesday, 3 November 2026

ఇళ్లస్థలాల కోసం మంత్రి కార్యాలయం ముట్టడించిన: సీపీఎం నాయకులు

ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం నగరంలో అర్హులైన పేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర ఉద్యానశాఖ మంత్రి రామిరెడ్డి వెంకట రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సీపీఎం నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులకు, పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మహిళలను కొంతమంది మహిళా కానిస్టేబుళ్లు ఈడ్చుకెళ్లారు. అనేక మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు మంత్రి కార్యాలయంలోకి చొచ్చుకుపోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్‌ కార్యదర్శి ఎర్రా శ్రీకాంత్‌, నాయకులు విక్రమ్‌, మీరా, గట్టు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *