Monday, 2 November 2026

బస్సు ట్రిప్పులను పెంచాలని డిమాండ్‌ చేస్తూన్న : విద్యార్థులు

సదాశివనగర్‌: సదాశివనగర్‌ మండలం పోసానిపేట గ్రామానికి ఆర్టీసీ బస్సు ట్రిప్పులను పెంచాలని మంగళవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కామారెడ్డి బస్సు డిపో నుంచి తమ గ్రామానికి రోజుకు పది ట్రిప్పుల చొప్పున బస్సులు తిప్పాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కామారెడ్డి ఆర్టీసీ, డిఎం జగదీష్‌ వచ్చే వరకు ఆందోళన చేస్తామని విద్యార్థులు నినాదాలు చేశారు. దీంతో డీఎం సంఘటనాస్థలానికి వచ్చి గ్రామానికి పది ట్రిప్పుల చొప్పున బస్సులు తిప్పుతామని హామీ ఇవ్వడంతో ఆందోళనా కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పోచయ్య, ఉపసర్పంచి రవి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *