ఆదోని నేరవిభాగం(కర్నూలు): పట్టణంలో రాజశ్రీ ఫంక్షన్ హాలులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వలగుండ మండల వ్యవసాయ అధికారి వెంగళరెడ్డి రూ. 3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వలగుండ మండలం గజ్జహల్లి గ్రామానికి చెందిన వ్యాపారి మహబూబ్ భాషా ఎరువుల దుకాణం లైసెన్సు పునరుద్ధరణ కోసం వెంగళరెడ్డిని ఆశ్రయించగా రూ. 3వేలు లంచం అడిగారు. దీంతో మహబూబ్ భాషా ఏసీబీ అధికారులను అశ్రయించాడు. వ్యవసాయాధికారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




