హైదరాబాద్,(జనంసాక్షి): మాజీ మంత్రులు సమితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావుకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జ్యుడిషీయల్ కస్టడీకి పంపాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. వీరిద్దరూ బయట ఉంటే కేసుపై ప్రభావం చూపుతారు అని సీబీఐ పేర్కొంది. రాజీనామా చేశాక వీరిద్దరూ మీడియాతో మాట్లాడడాన్ని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే రాజీనామాలపై ప్రజలకు వివరణ ఇచ్చామని వారు పేర్కొన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ నిందితులు.




