Tuesday, 3 November 2026

రైల్వే ఆస్తులు ధ్వంసం చేస్తే కేసులు: డీజీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): డీజీపీ దినేష్‌రెడ్డి ఈ రోజు మీడియా   సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైళ్లకు అడ్డుపడినా, రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినా నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. సీమాంధ్రలో రైల్‌రోకోలపై పునరాలోచించుకోవాలని ఆయన హెచ్చరించారు. జాతీయ నేతల విగ్రహాలు ధ్వంసం చేస్తే మేడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని డీజీపీ పేర్కొన్నారు. ఉద్యోగుల కార్యాలయాల ప్రాంగణాల్లో సభలు సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *