Tuesday, 3 November 2026

తెలంగాణ ప్రజలు విశాలాంధ్ర కోరుకోవట్లేదు

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం,స్వయం పాలనకు సంబంధించిందని ఉప ముఖ్యమంత్రి దామెదర రాజనర్సింహా అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ది ప్రెస్‌ లో ఉపముఖ్యమంత్రి మాట్లాడారు. ఇదివరకు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్నే మేము డిమాండ్‌ చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో వరుసగా విద్య, ఉద్యోగ రంగాలకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగాయని తెలిపారు. విశాలాంద్ర కావాలని ప్రజలు కొరుకోవట్లేదన్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా తెలంగాణ వాదులేనని స్పష్టం చేశారు. నదీజలాలు, విద్యుత్‌పై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను రాజనర్సింహ తప్పుబట్టారు. హైదరాబాద్‌ తెలంగాణలో భాగమేఅని హైదరాబాద్‌లో నివసించే వారు సెటిలర్లు కాదని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *