పార్టీ కాదు, కేంద్ర ప్రభుత్వ కమిటీ వేయాలి : వెంకయ్యనాయుడు
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల ఆందోళనలపై పార్టీ కమిటీ కాదు, కేంద్ర ప్రభుత్వ కమిటీ వేయాలని భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు సూచించారు. సున్నిత భావోద్వేగాలతో కూడిన అంశంపై కాంగ్రెస్ ఉద్వేగాలను రెచ్చగొడుతుందని వెంకయ్యనాయుడు అన్నారు. ఒకే వాదనలు లేకుండా రెండు నాల్కలతో ఇరువైపుల ప్రయోజనం పొందాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. సీయాంధ్ర ప్రజల ఆందోళనకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రానిదేనని వెంకయ్య నాయుడు అన్నారు.