Tuesday, 3 November 2026

సీఎం పార్టీకి, పదవికి రాజీనామా చేసి అధిష్టానికి తన అభిప్రాయాన్ని వినిపించాలి : కొదండరాం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రాంత పక్షపాతిగా అనైతికంగా వ్రవర్తిస్తున్నారని టి జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ కార్యాలయంలో జేఏసి భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా సీఎం మట్లాడారని ధ్వజమెత్తారు. సీఎం తన అభిప్రాయాన్ని అధిష్టానికి బలంగా వినిపించాలనుకుంటే పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం వ్యాఖ్యలను9 నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో నిరసన ర్యాలీలు చేపడుతామని తెలిపారు. నిరస ర్యాలీలను విజయవంతం చేయాలని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *