Tuesday, 3 November 2026

సీఎం వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 10 నుంచి ర్యాలీలు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,11,12 తేదీల్లో ర్యాలీలు చేపట్టాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఒక ప్రాంత పక్షపాతిగా అనైతికంగా ప్రవర్తించారని, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట్లాడారని ఆయన ఆరోపించారు. సీఎం తన అభిప్రాయాన్ని బలంగా వినిపించాలనుకుంటే పార్టీకి, పదవికి రాజీనామా చేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *