Tuesday, 3 November 2026

నరేంద్ర మోడీ సభకు భారీ బందోబస్తు

హైదరాబాద్‌,(జనంసాక్షి): గుజరాత్‌ సీఎం, బీజేపీ సీనియర్‌ నేత నరేంద్ర మోడీ రేపు నగరానికి రానున్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించబోయే సభలో మోడీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో 3 వేల మంది పోలీసులతో భద్రత పటిష్టం చేశారు. ఇప్పటికే ఎల్బీ స్టేడియంను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్టేడియం కెపాసిటీ 35 వేల మంది కాగా, లక్షకు పైగా ప్రతినిధుల పాస్‌లను బీజేపీ జారీ చేసింది. స్టేడియం సామర్థ్యాన్ని మించి లోపలికి అనుమతించమని పోలీసులు స్పష్టం చేశారు. మోడీ సభ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *