చిన్న రాష్ట్రలతో బహుజనులకు న్యాయం : వివేక్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): చిన్న రాష్ట్రలతోనే బహుజనులకు న్యాయం జరుగుతుందని అంబేద్కర్‌ భావించారని ఎంపీ వివేక్‌ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తీసుకురావడానికి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎంతగానో కృషి చేయాలని , ఎస్సీ, ఎస్టీలకు చెందిన అధికారుల ప్రమోషన్‌లు న్యాయబద్దంగా జరగడంలేదని ఎంపీ పేర్కొన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో మహిళలు-బహుజనుల భవిష్యత్తు అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో చర్చాగోష్ఠి జరిగింది. వచ్చే తెలంగాణలోనేనా బహుజనులకు, మహిళలకు న్యాయం చేయాలని వక్తలు కోరారు.