Tuesday, 3 November 2026

నగరంలో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): బీజేపీ ప్రచార రథసారథి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నగరానికి వస్తున్న సందర్భంగా నగర పోలీసులు పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బీజేపీ ఆధ్వర్యంలో రేపు బషీర్‌బాగ్‌లోని లాల్‌బహదూర్‌ స్టేడియంలో నిర్వహించబోయే యువభేరీ సభకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌ ఆం్షలు తప్పనిసరైంది. ఈ ఆంక్షలు రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అమలుతో ఉంటాయని ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అమిత్‌గార్గ్‌ తెలిపారు.  నాంపల్లి, బషీర్‌బాగ్‌, అబిడ్స్‌, రవీంద్రభారతి, లిబర్టీలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల నుంచి సభకు వచ్చే వాహనాలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో పార్కింగ్‌ ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *